- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేనో హీరోయిన్‌ను.. అయినా ఎవరూ ప్రేమించడంలేదు.. ఏడుపు వస్తోంది.. నటి కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్ : ‘ఖో గయే హమ్ కహాన్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే. డిసెంబర్ 26 విడుదల కానున్న ఈ మూవీలో ప్రమోషన్స్‌లో మునిగిపోయింది చిత్రబృందం. సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే జంటగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్జున్ వరైన్ డైరెక్షన్ చేశారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అనన్య తను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోజులను గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా అప్పట్లో ఆమె పడ్డ ఇబ్బందులను వివరించింది.
‘‘నేనో పబ్లిక్ ఫిగర్‌ను. నా తల్లిదండ్రుల వారసత్వంగా నేను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంతో నటను ప్రారంభించాను. కరణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీలో నా ఫర్మార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాను. ప్రశంసలు వచ్చాయి. కానీ ఆ సమయంలో అభిమానులు నన్ను ప్రేమించకపోవడం ఇప్పటికీ ఆందోళన కలిగిస్తోంది. చుంకీ పాండే నుంచి వచ్చిన వారసత్వం, గౌరవం పొందాలనుకున్న నాకు ఫ్యాన్స్ బిగ్ షాక్ ఇచ్చారు. వాళ్లు నన్ను ప్రేమించట్లేదని తీవ్ర ఆందోళన చెందాను. ఒత్తిడికి గురయ్యాను. నేను ఊహించుకున్న ప్రపంచం తలకిందులు కావడంతో వెక్కి వెక్కి ఎడావాలనిపించింది’’ అంటూ తన గతం గుర్తుకు చేసుకుంది అనన్య పాండే.