నా ముందు ఏ హీరో నిలబడలేడు: షారుక్ ఖాన్

by sudharani |   ( Updated:2024-06-01 14:32:40.0  )
నా ముందు ఏ హీరో నిలబడలేడు: షారుక్ ఖాన్
X

దిశ, వెబ్‌డెక్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కాంబోలో వస్తున్న సినిమా ‘జవాన్‌’. నయనతార, దీపికా, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ మూవీపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచేశాయి. ఇక తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో షారుక్ ఖాన్ హీరోనా, విలనా అనేది ఆశ్చర్యకరంగా మారింది. ఇక ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు యాక్షన్ సీన్లతో నిండిపోయింది. అయితే.. ట్రైలర్ లాస్ట్‌లో ‘‘ఇది ఆరంభం మాత్రమే. నేను విలనైతే.. ఏ హీరో నాముందు నిలబడలేదు’’ అనే డైలాగ్ ప్రస్తుతం హైలెట్‌గా నిలిచింది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోబోతుందో.

Advertisement

Next Story