ఆ ప్రత్యేక అనుభూతిని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది: Niti Taylor

by Hamsa |   ( Updated:2022-12-25 11:20:53.0  )
ఆ ప్రత్యేక అనుభూతిని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది: Niti Taylor
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ నితి టేలర్ తనకు ఇష్టమైన క్రిస్మస్ పండుగకు ఫ్యామిలీతో లేకపోవడం బాధగా ఉందని చెప్పింది. ఈ మేరకు వర్క్ షెడ్యూల్ కారణంగా ఈ యేడాది వేడుకలు మిస్ అవుతున్నానన్న ఆమె.. కొన్ని రోజులముందే కుటుంబసభ్యులతో కలిసి గోవాలో క్రిస్మస్ పార్టీ జరుపుకున్నట్లు తెలిపింది. 'నేను తొమ్మిది నెలల తర్వాత అందరినీ కలిశాను. నా భర్తతో సహా! మరికొద్ది రోజుల్లో వారితోకలిసి న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ చేసుకుంటా. కానీ, ఈ యేడాది వరుస ప్రాజెక్టులతో బిజీ ఉండటం వల్ల ఏ కాస్త విరామ సమయం దొరికినా విలువైనదిగానే భావిస్తున్నా. ఇంట్లో తయారుచేసిన క్రిస్మస్ కేక్‌ను స్నేహితులతో పంచుకోవడం ప్రత్యేక అనుభూతి. అర్థరాత్రి చర్చికి వెళ్లి ప్రార్థనలు చేయడం మా ఆచారం. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఇప్పుడు కూడా చేస్తాను. చిన్నప్పటినుంచి కోల్‌కతాలోని మా అమ్మమ్మ ఇంటికి వెళ్లానే ఇళ్లంతా లైట్లతో అలంకరించి మంచి వంటకాలు చేసుకుని విందు ఆరగించే అద్భుతమైన జ్ఞాపకాలను ఎన్నటికీ మరిచిపోలేను' అంటూ వివరించింది.

ఇవి కూడా చదవండి : ఆ రోజే దానితో ప్రేమలో పడ్డాను: హ్యూమా ఖురేషి

Advertisement

Next Story