పుట్టుకతోనే నా గుండెకు రంధ్రం ఉంది: నీతి టేలర్

by Hajipasha |   ( Updated:2022-12-01 15:16:36.0  )
పుట్టుకతోనే నా గుండెకు రంధ్రం ఉంది: నీతి టేలర్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నీతి టేలర్ తన అనారోగ్య పరిస్థితి గురించి ఓపెన్ అయింది. ఇటీవల సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడినట్లు అనౌన్స్ చేసినప్పటి నుంచి వరుసగా నటీమణులు తమ వ్యాధుల గురించి పోటీ పడి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా ఇంటరాక్షన్‌లో నీతి టేలర్.. ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో ప్రదర్శన చేస్తూ జారి పడిపోయినప్పటి నుంచి ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదని చెప్పింది. అంతేకాదు పుట్టుకతోనే తన గుండెలో రంధ్రం ఉందన్న నటి.. దీంతో కఠినమైన కార్యకలాపాలు చేయడానికి తనకు అనుమతి లేదని వెల్లడించింది. 'నేను నా హార్ట్‌లో హోల్‌‌తోనే జన్మించాను. విహారయాత్రలకు వెళ్లలేను. విమానాలలో ప్రయాణించలేను. సాహసోపేతంగా ఏమీ చేయలేకపోయా. అయితే ఇటీవల ఆపరేషన్ తర్వాత పూర్తిగా కోలుకున్నా. ఆనందంతో డ్యాన్స్ చేశా. భవిష్యత్తులో స్టంట్స్ చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది' అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది.

READ MORE

సి-సెక్షన్ డెలివరీ.. బాధలోనూ ఆనందాన్ని వెతుక్కున్నా: డెబినా

Advertisement

Next Story