Nindu Noorella Savasam August 25th Episode: ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న భాగమతి తండ్రి రామ్మూర్తి.. అమర్‌కి చేరువగా భాగీ!

by sudharani |   ( Updated:2023-08-25 07:56:18.0  )
Nindu Noorella Savasam August 25th Episode: ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న భాగమతి తండ్రి రామ్మూర్తి.. అమర్‌కి చేరువగా భాగీ!
X

దిశ, సినిమా: ఆర్మీ మేజర్‌గా కొడైకెనాల్లో భార్యా పిల్లలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు అమర్. తన మంచితనంతో ఇంట్లో అందరినీ ప్రేమగా చూసుకునే అరుంధతికి ఆర్జే భాగమతి అంటే చాలా ఇష్టం. ఆమె ప్రతి ప్రోగ్రామ్‌కి తానే ఫస్ట్ కాల్ చేసి సర్ప్రైజ్ చేసేది. అరుంధతితో బంధం భాగమతి మనసులోనూ చాలా సంతోషాన్ని నింపేది. తమ పెళ్లిరోజుకి కొడైకెనాల్ రమ్మని భాగమతికి టిక్కెట్లు పంపిస్తుంది అరుంధతి. కానీ పెళ్లిచూపుల్లో తనని కాదని అరుంధతిని పెళ్లి చేసుకున్నాడని అమర్‌ని ఎలాగైనా దక్కించుకోవాలని పగబడుతుంది మనోహరి. అందుకోసం అరుంధతిని చంపేయాలని ప్లాన్ చేస్తుంది. పెళ్లిరోజునే అరుంధతిని చంపించేస్తుంది మనోహరి. పిల్లలు, అమర్ చనిపోయిన అరుంధతి కోసం బాధపడుతుంటే ఆ స్థానాన్ని తాను భర్తీ చేసే ఆలోచనల్లో ఉంటుంది.

కుటుంబసభ్యులతో కలిసి అరుంధతి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తాడు అమర్. అప్పుడే తన సవతి తల్లి నుంచి తన తండ్రికి ఆరోగ్యం బాలేదని ఫోన్ రావడంతో స్నేహితురాలు కరుణతో కలిసి హాస్పిటల్‌కి వెళ్తుంది భాగమతి. అక్కడ చెట్టు కింద ఉన్న తండ్రిని చూసి షాకవుతుంది. డబ్బులు కడితేనే హాస్పిటల్లో చేర్చుకుంటామంటున్నారని చెబుతుంది సవతి తల్లి. వెంటనే తండ్రిని హాస్పిటల్లో చేర్చి చికిత్స కొనసాగించమని డాక్టర్లను వేడుకుంటుంది భాగమతి.

మనోహరిని అరుంధతి ఆత్మ వెంటాడుతుంది. దాంతో ఇంటి పనిమనిషికి చెప్పి తాయత్తు తీసుకుని రమ్మంటుంది. సరేనన్న పనిమనిషి తాయత్తు తెచ్చి గుమ్మానికి కడుతుంది. దాని ప్రభావంతో నిద్రపోతున్న తన పిల్లలను చూసుకుంటున్న అరుంధతి ఆత్మ బయటకు నెట్టివేయబడుతుంది. ఎంత ప్రయత్నించినా అరుంధతి ఆత్మ ఇంట్లోకి రాలేకపోతుంది. చనిపోగానే తనను పైకి తీసుకెళ్లకుండా కిందే ఎందుకు ఉంచావ్.. నా పిల్లలను చూసుకోకుండా నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం? అంటూ దేవుడిని ప్రశ్నిస్తుంది అరుంధతి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చిత్ర విచిత్రగుప్తుడు ప్రత్యక్షమవుతాడు. అరుంధతి ఆత్మ నేలపైనే 12వ రోజు వరకు ఉంటుందని చెబుతాడు.

భాగమతి తండ్రి రామ్మూర్తి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని, చికిత్స చెయ్యాలంటే చాలా పరీక్షలు చెయ్యాలనీ, అధిక మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని చెబుతారు డాక్టర్లు. ఉద్యోగం పోయి కష్టాల్లో ఉన్న భాగమతికి ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచనలో పడుతుంది. ఎవరైనా ఆర్మీ ఆఫీసర్ అనుమతి తీసుకుని వస్తే తమ హాస్పిటల్లో ఉచిత వైద్యం చేసే అవకాశం ఉందని భాగమతికి చెబుతాడు డాక్టర్. దాంతో భాగమతి తన తండ్రిని బతికించుకోవడం కోసం సహాయం చేసే ఆర్మీ ఆఫీసర్ వేటలో పడుతుంది. భాగమతి అమర్‌ని ఎలా కలుస్తుంది? భార్య చనిపోయిన బాధలో ఉన్న అమర్ భాగమతికి సహాయం చేస్తాడా? అరుంధతి ఆత్మ 12 రోజులు ఎందుకు భూమిపై ఉంటుంది? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈరోజు, ఆగస్టు 25న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!

Advertisement

Next Story