లావణ్య త్రిపాఠికి బర్త్ డే విషెస్ చెప్పిన నిహారిక.. బ్యూటిఫుల్ పోస్ట్ వైరల్

by Anjali |   ( Updated:2023-12-15 13:22:23.0  )
లావణ్య త్రిపాఠికి బర్త్ డే విషెస్ చెప్పిన నిహారిక.. బ్యూటిఫుల్ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. హానిమూన్ ట్రిప్‌లో ఫుల్ బిజీగా గడిపేస్తూ.. ఎప్పటికప్పుడు పోస్ట్‌లు పెడుతూ మెగా ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. అయితే లావణ్య పెళ్లైన తర్వాత.. నేడు ఫస్ట్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. కాగా లావణ్యకు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా మెగా డాటర్ నిహారిక తన వదినమ్మకు స్వీట్‌గా బర్త్ డే విషెస్ తెలిపింది. ‘‘అత్యుత్తమమైన నీకు హ్యాపీయెస్ట్ బర్త్ డే వదిన. నీ లైఫ్‌లో మరింతగా సంతోషం, ప్రేమ, ప్రశాంతత వెల్లివిరియాలి. లవ్యూ వదిన’’ అంటూ నిహారిక.. లొట్టచెంపల ముద్దుగుమ్మ లావణ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. పెళ్లి రోజు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేడు లావణ్య త్రిపాఠి 33 ఏళ్లలోకి అడుగుపెట్టింది.


Advertisement

Next Story

Most Viewed