ఎన్టీఆర్ ఇంట్లో నైట్ పార్టీ.. అథిదులు ఎవరో తెలుసా..?

by sudharani |   ( Updated:2023-04-13 07:21:35.0  )
ఎన్టీఆర్ ఇంట్లో నైట్ పార్టీ.. అథిదులు ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఎన్టీఆర్30’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి ఎన్టీఆర్ టీం అందరితో తన ఇంట్లో నైట్ పార్టీ ఎంజాయ్ చేశాడు. ఈ పార్టీలో ఇంటర్నేషనల్ అమెజాన్ స్టూడియోస్ వైస్ చైర్మన్ జేమ్స్ ఫేరెల్ కూడా సందడి చేశారు.

ఆయనతో పాటు.. NTR 30 టీమ్, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, మైత్రి మూవీ మేకర్స్ అందరూ పాల్గొని సందడి చేశారు. అంతే కాకుండా ఇంట్లోనే పార్టీ జరగడంతో ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణీత కూడా పాల్గొని అలరించింది. కాగా.. నైట్ పార్టీకి సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఫోస్ట్ చేస్తూ ‘‘స్నేహితులు, శ్రేయోభిలాషులతో చక్కగా గడిపిన సాయంత్రం. జేమ్స్, ఎమిలీలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ మాటను నిలబెట్టుకున్నందుకు, మాతో కలిసి విందు చేసినందుకు ధన్యవాదాలు’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

మహేష్-జక్కన్న మూవీ.. స్టోరీపై క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్

Advertisement

Next Story