ప్రభాస్ ఫ్యాన్స్‌ను కంగారు పెట్టిస్తున్న న్యూస్..!

by sudharani |   ( Updated:2023-08-17 09:45:23.0  )
ప్రభాస్ ఫ్యాన్స్‌ను కంగారు పెట్టిస్తున్న న్యూస్..!
X

దిశ, సినిమా: ప్రభాస్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ పార్ట్ 1 సెప్టెంబర్ 28న విడుదల కాబోతుంది. కాగా తాజాగా ఈ మూవీ రన్ టైమ్ గురించి కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. సినిమా 2 గంటల 50 నిమిషాల నిడివితో ఉంటుందని తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్‌లో కంగారు మొదలైంది. ఈ రన్ టైమ్ వల్ల సినిమా రిజల్ట్ తారుమారయ్యే చాన్స్ ఉంటుందని భయపడుతున్నారు. యాక్షన్ సినిమా అంత తక్కువ రన్ టైమ్ అంటే చాలా కష్టమని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ డైరెక్టర్ నీల్ మాత్రం రన్ టైమ్ ఎంత అన్నది మ్యాటర్ కాదు ఆడియన్స్‌ను ఎంత బాగా ఎంగేజ్ చేశారనేది ఇంపార్టెంట్ అంటూ ఈ రన్ టైం లాక్ చేశాడని తెలుస్తోంది. అంతేకాదు ‘సలార్ 1’లో పార్ట్ 2‌కు సంబంధించిన క్లూస్ కూడా ఉంటాయని టాక్ వినపడుతుంది.

Advertisement

Next Story