హీరో రామ్‌తో లవ్ ఎఫైర్.. మధ్యలోనే బ్రేకప్ అయిందంటూ అనుపమ ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-07-09 08:37:53.0  )
హీరో రామ్‌తో లవ్ ఎఫైర్.. మధ్యలోనే బ్రేకప్ అయిందంటూ అనుపమ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ప్రేమమ్’ సినిమాతో అనుపమ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో ‘అఆ’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, కార్తికేయ-2, బటర్ ఫ్లై, 18 పేజెస్ వంటి చిత్రాలతో అలరించింది. అయితే అనుపమ, ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలో హీరో రామ్‌తో ప్రేమలో పడినట్లు ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దీనిపై అనుపమ స్పందించింది. ‘‘ హీరో రామ్, క్రికెటర్ బుమ్రాతో లవ్ ఎఫైర్ నడిపిన్నానని వార్తలు రాశారు. అవి ఏ మాత్రం నిజం కాదు. వాళ్లు నాకు మంచి ఫ్రెండ్స్ అంతే. అయితే గతంలో ఓ వ్యక్తిని ఇష్టపడ్డాను. బట్ మధ్యలోనే అతనితో బ్రేకప్ అయింది. ఒక ఇప్పుడు ఎవరితోనైనా పడితే కచ్చితంగా చెప్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అది తెలిసిన నెటిజన్లు అనుపమ ప్రేమించిన ఎవరా అని నెట్టింట సెర్చ్ చేస్తున్నారట.

Advertisement

Next Story