పుష్ప 2 సినిమా నుంచి కొత్త అప్డేట్

by Prasanna |   ( Updated:2023-05-19 13:01:41.0  )
పుష్ప 2  సినిమా నుంచి కొత్త అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప2 . ఈ సినిమాకి అనుకున్నంత బడ్జెట్ కన్నా ఎక్కువే అవుతుందని తెలుస్తుంది.ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలిసిందే. ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు పుష్ప2 సినిమాని కూడా అదే రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది .పుష్ప సినిమాలో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించారు. సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్, ఫహద్ మధ్య సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా పుష్ప-2 సినిమాలో ఫహద్ ఫాజిల్ షూటింగ్ కంప్లిట్ చేసినట్టు డైరెక్టర్ సుకుమార్ ఒక ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

Also Read: ‘టైగర్ 3’ సినిమా సెట్‌లో సల్మాన్ ఖాన్‌కు గాయం.. పోస్ట్ వైరల్..

మరి ఇంత ఘోరమా.. అందరి ముందే అలా చేసిన పవిత్రా, నరేశ్

Advertisement

Next Story