మహేష్ , త్రివిక్రమ్ సినిమా కాంబో నుంచి కొత్త అప్డేట్

by Prasanna |   ( Updated:2023-01-21 05:28:06.0  )
మహేష్ , త్రివిక్రమ్ సినిమా కాంబో నుంచి కొత్త అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదొక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వీరి కాంబోలో సినిమా చేస్తుండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. సూపర్ స్టార్ కృష్ణ కన్ను మూయడంతో ఈ సినిమా షూటింగ్ కు మహేష్ వెళ్లలేకపోయారు. ఘట్టమనేని కుటుంబంలో వరస మరణాలతో తీవ్ర మనస్తాపం చెందిన మహేష్ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ లో రాజకీయాలు ఫ్యాక్షన్ గొడవలని టచ్ చేస్తూ కథని తయారు చేసారని తెలిసిన సమాచారం. ఇది ఎంత వరకు నిజమన్నది ఇంకా తెలియాలిసి ఉంది.

Also Read...

Shraddha Das: నడుము ఒంపులతో మాయ చేస్తున్న శ్రద్దా

Advertisement

Next Story