'Guntur Kaaram' సినిమా నుంచి కొత్త అప్డేట్

by Prasanna |   ( Updated:2023-07-28 03:45:04.0  )
Guntur Kaaram సినిమా నుంచి కొత్త  అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం చేస్తున్నాడు. 2022 లో మొదలు పెట్టిన ఈ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. అప్పట్లో స్క్రిప్ట్ నచ్చకపోవడంతో మహేష్ బాబు షూటింగ్ ఆపేశారని పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో మళ్లీ త్రివిక్రమ్ స్క్రిప్టు రాసి కంప్లీట్ గా కొత్త వర్షన్ తో సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదట హీరోయిన్గా పూజా హెగ్డే అనుకొని ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత ఆమె స్థానంలో శ్రీ లీల ను తీసుకున్నారు.

కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసారు.ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చిన తాజా అప్డేట్ మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న కాబట్టి ఈ సంధర్భంగా ఆ రోజున గుంటూరు కారం సినిమా నుంచి టీజర్ కానీ ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. దీని పై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Also Read: Prabhas ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్.. పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన డార్లింగ్

Advertisement

Next Story