‘సెల్ఫిష్’ నుంచి కొత్త పోస్టర్‌.. అట్రాక్ట్ చేస్తున్న హీరో నయా లుక్

by Aamani |   ( Updated:2023-03-23 14:54:21.0  )
‘సెల్ఫిష్’ నుంచి కొత్త పోస్టర్‌.. అట్రాక్ట్ చేస్తున్న హీరో నయా లుక్
X

దిశ, సినిమా : యంగ్ హీరో ఆశిష్ రెడ్డి నటిస్తున్న యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’. సుకుమార్ రైటింగ్స్ అందించిన సినిమాకు కాశీ విశాల్‌ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు, శిరీష్‌ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ ఉగాది సందర్భంగా మూవీనుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో నోట్లో బీడీతో నిర్లక్ష్య వైఖరిని చూపిస్తున్నట్లు కనిపించిన ఆశిష్ రెడ్డి ఫస్ట్ లుక్ అభిమానులను అట్రాక్ట్ చేస్తుంది. గిరజాల జుట్టు, గడ్డంతో, తెల్లటి చొక్కా, ఆరెంజ్ కలర్ జీన్స్‌లో మాసీగా కనిపిస్తున్న హీరో ఈ సినిమా కోసం మంచి ఫిజిక్ బాడీ తయారు చేసుకున్నాడట. ఇక హైదరాబాద్‌లోని పాతబస్తీకి సంబంధించిన కథలో ఆశిష్ సెల్ఫిష్ ఓల్డ్ సిటీ వ్యక్తిగా కనిపించనున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు మేకర్స్.

Also Read...

‘మీటర్’ నుంచి సెకండ్ సింగిల్.. ‘ఓ బేబీ’ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

Advertisement

Next Story