Vishwambhara : ‘విశ్వంభర’ మూవీ టీమ్‌కు మొదలైనా కొత్త తలనొప్పి..

by Kavitha |   ( Updated:2024-03-05 06:25:27.0  )
Vishwambhara : ‘విశ్వంభర’ మూవీ టీమ్‌కు మొదలైనా కొత్త తలనొప్పి..
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విశ్వంభర’. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను యు వి క్రియేషన్స్ వారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి ఇప్పటి వరకు కనిపించనట్టు వంటి పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ప్రస్తుతం మూవీ షూటింగ్ షెడ్యూల్‌ ఎలాంటి సమస్యలు లేకుండా చక్కటి ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి పాత్రకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు చెల్లెలు ఉండబోతున్నారు. కాగా ఆ చెల్లెల్ల కోసం, ఆ చెల్లెల్లకు జోడీలను వెతకడంలో ప్రస్తుతం చిత్ర బృందం కింద మీద పడుతుంది. త్రిష హీరోయిన్ హీరోయిన్ గా ఓకే అయినప్పటికి. ఈషా చావ్లా, సురభి, ఆషిక రంగనాథ్ లు ఈ సినిమాలో చిరు చెల్లెళ్ల పాత్రల్లో కనిపిస్తారు అనే టాక్ వినిపిస్తోంది. ఇక వారితో పాటుగా మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్‌లు కూడా సినిమాలో ఉన్నారు. మరి వాళ్ళు చిరు సరసన హీరోయిన్లుగా కనిపిస్తారా లేక చెల్లెల లాగా కనిపిస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

Next Story