Aishwarya Rai: ఐశ్యర్య రాయ్‌‌ కోసం అభిషేక్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

by Prasanna |   ( Updated:2023-05-02 15:11:57.0  )
Aishwarya Rai: ఐశ్యర్య రాయ్‌‌ కోసం అభిషేక్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాష‌తో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఇక సెకండ్ ఇన్నింగ్‌ సినిమాల విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటోంది. కొన్ని ముఖ్య పాత్రలు మాత్రమే ఎంచుకుని, అప్పుడప్పుడు బిగ్ మూవీస్‌లో కనిపిస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ చిత్రం విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ఐశ్వర్య నటనకు అభిమానులు ఫుల్ ఫిదా అయ్యారు. సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్ బచ్చన్‌కు ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. ‘ఐశ్వర్య రాయ్ మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం, మీరు అడ్డు చెప్పకుండా. మీ కూతురు ఆరాధ్యను జాగ్రత్తగా చూసుకోండి’ అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ ‘ఆమెకు నచ్చిన విషయం‌లో నా అనుమతి అవసరం లేదు’ అని రిప్లయ్ ఇచ్చాడు.

Read more:

ఆరాధ్యను పొగిడేస్తున్న నెటిజన్స్.. పెద్దలను గౌరవించే విధానానికి ఫిదా..

Advertisement

Next Story