- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Keerthy Sureshతో అలా నటిస్తే హీరోలకి పెద్ద ముప్పే అంటున్న నెటిజన్లు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడు వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమాలో చెల్లిగా నటించింది. దీనిని డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్‌గా తమన్నా నటించింది. అయితే భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు భావించారు. ఊహించని విధంగా ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. సినిమా ఫ్లాప్ అవ్వడానికి అనేక రకాల కారణాలు వినిపిస్తున్నాయి.
తాజాగా, నెట్టింట మరో విషయం హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కథానాయికగా, హీరోలకు చెల్లిగా కూడా నటిస్తుంది. భోళా శంకర్ విడుదల కాకముందే ఫ్లాప్ అవ్వడం గ్యారెంటీ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిజంగానే జరగడంతో కీర్తి సురేష్ చెల్లిగా చేయడం వల్ల హీరోలకు పెద్ద ముప్పుగా మారుతుందని నెటిజన్లు అంటున్నారు. అలాగే చిరుకి కలిసి రానట్టుగానే సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కూడా అస్సలు అచ్చిరాలేదని టాక్. రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ లో కీర్తి సురేష్ చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఘోరమైన డిజాస్టర్‌ను పాలైంది. కీర్తి సురేష్ నటించడం వల్లే అవి ఫ్లాప్ అయ్యాయని చెప్పుకొస్తున్నారు. అందుకు భోళా శంకర్,అన్నాత్తే సినిమాలు చక్కటి ఉదాహరణలుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది.