ఈ విషయంలో సూర్య తర్వాతే ఎవరైనా.. నువ్వు నిజంగా గ్రేట్ బాస్ !

by Anjali |   ( Updated:2023-11-06 15:40:31.0  )
ఈ విషయంలో సూర్య తర్వాతే ఎవరైనా.. నువ్వు నిజంగా గ్రేట్ బాస్ !
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్స్ సినిమాల్లో నటిస్తున్న క్రమంలో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందులో కోలీవుడ్ క్యూట్ కపుల్స్ జ్యోతిక, సూర్య కూడా ఉన్నారు. అయితే భార్య ఇంట్లో ఉంటే భర్త సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారు పెళ్లి అయిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అవుతున్నారు. కానీ భార్య అభిరుచి గురించి తెలిసి ఆమెను అదే ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. ఇప్పుడు హీరో సూర్య ఈ లిస్ట్‌లో చేరిపోయాడు.

జ్యోతిక విషయంలో చాలా సపోర్ట్ చేస్తున్నాడు సూర్య. అందుకే ఇప్పటికి కూడా ఆమె ఇండస్ర్టీలో కొనసాగుతుంది. అంతేకాదు జ్యోతిక సినిమాలు తీస్తాను అంటే సూర్య డబ్బులు పెట్టి సినిమాల నిర్మాణం కూడా చేయిస్తున్నాడు. సక్సెస్ అందుకుంటున్నాడు. ఇక జ్యోతిక కూడా సూర్యను అంతే ప్రేమిస్తూ.. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ.. అటు ప్రొఫెషనల్‌గా ఎదుగుతూ.. బ్యాలెన్స్‌డ్ లైఫ్ లీడ్ చేస్తుంది.

Advertisement

Next Story