అమల గురించి హార్ట్ టచింగ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..

by sudharani |   ( Updated:2022-09-13 15:26:46.0  )
అమల గురించి హార్ట్ టచింగ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..
X

దిశ, సినిమా: వెండితెరపై అప్పుడప్పుడు సందడి చేస్తుంది నటి అక్కినేని అమల. దాదాపు 35 ఏళ్ల క్రితం ఒక తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ చిత్రాల్లో నటించింది. తర్వాత నాగార్జునతో వివాహానంతరం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. ఇక 2012లో 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' మూవీ ద్వారా మంచి తల్లి పాత్రతో రీఎంట్రీ ఇచ్చారు.

ఇన్నాళ్ల తర్వాత మళ్లీ 'ఒకే ఒక జీవితం' చిత్రంలో పూర్తిస్థాయి నటనా ప్రాధాన్యమున్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రీసెంట్‌గా సెప్టెంబర్ 12న అమల పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున, అఖిల్, శర్వానంద్.. వారి ఇన్ స్టా ద్యారా బర్త్ డే విష్ చేశారు. అలాగే ఆమె అభిమానులు, ముఖ్యంగా తమిళ అభిమానులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. 'అమల మేడం! ప్లీజ్‌ మీరు నటనను కొనసాగించండి, మీరు తమిళ సినిమాల్లో తిరిగి నటించాల్సిందే, మీరెంత బిజీగా ఉన్నా సినిమాల్లో కనిపించండి ప్లీజ్‌' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అందంగా లేకపోయినా అవకాశం ఇచ్చారు.. కన్నీళ్లు పెట్టుకున్న Priyanka Chopra

Advertisement

Next Story