ఉపాసనకు క్లాస్ పీకుతున్న నెటిజన్లు.. వరుసలు కూడా తెలియదా.. అంత పెద్దావిడను అలాగేనా పిలిచేది అంటూ ఫైర్

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-21 14:18:53.0  )
ఉపాసనకు క్లాస్ పీకుతున్న నెటిజన్లు.. వరుసలు కూడా తెలియదా.. అంత పెద్దావిడను అలాగేనా పిలిచేది అంటూ ఫైర్
X

దిశ, సినిమా : మెగా కోడలు ఉపాసన మెట్టింటి పేరును నిలబెడుతుందని చెప్పడంలో సందేహం లేదు. భర్త రామ్ చరణ్ కు తగిన భార్య అనిపించుకున్న ఆమె.. గొప్ప కోడలిగా కూడా మన్ననలు అందుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో కలిసి అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయించింది. అత్తమ్మ బర్త్ డే రోజే ఈ విషయం తెలుపుతూ పోస్ట్ పెట్టింది.

ఇక ఇందులో భాగంగా తాజాగా ఆవకాయ పెడుతున్న పోస్ట్ పెట్టింది ఉపాసన. కొత్తగా ట్రై చేస్తున్నామని.. ఈ క్రమంలో ఇంటి లివింగ్ ఏరియా కిచెన్ అయిపోయిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియోలో చిరు తల్లి అంజనా దేవిని నానమ్మ అని సంబోధించింది. దీంతో నెటిజన్లు ఈ ఒక్క మాటనే టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తున్నారు కదా భర్తకు నానమ్మ అయిన వ్యక్తి మీకు అమ్మమ్మ అవుతుందని కూడా తెలియదా అని విమర్శిస్తున్నారు . ఇప్పటికైనా వరుసలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story