- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో లావణ్య కాలి గోటికి కూడా వరుణ్ సరిపోడా?
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్.. వీరి సతీమణులు, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీ అంతా ఇటలీలో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక వివాహానంతరం వరుణ్-లావణ్యతో పాటు అందరూ హైదరాబాదుకు చేరుకున్నారు. 5వ తారీకున టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలను ఆహ్వానించి.. గ్రాండ్‌గా రిసెప్షన్ చేసుకున్నారు. ప్రస్తుతం వీరి రిసెప్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా లావణ్య.. మెగాస్టార్ చిరంజీవి కాళ్లు మొక్కిన పిక్‌ను మెగా ఫ్యాన్ వైరల్ చేస్తూ... లొట్టచెంపల ముద్దుగుమ్మను ఆకాశనెత్తుతున్నారు.
ఇకపోతే లావణ్య త్రిపాఠి మెగా కోడలు కాబోతుందని ఎప్పుడు తెలిసిందో అప్పటినుంచి జనాలు గూగుల్లో.. లావణ్య ఏజ్ ఎంత? లావణ్య ఏం చదువుకుంది? ఇష్టమైన ఫుడ్ ఏంటి ? లావణ్య ఏ స్టేట్‌కు సంబంధించినది? ఫేవరెట్ కలర్ ఏంటి? అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా లావణ్య ఆస్తి డీటెయిల్స్ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే, లావణ్య సినిమాల్లో నటించి సంపాదించింది కేవలం రూ.35 కోట్లు మాత్రమే అని సమాచారం. కానీ తన ముత్తాతల ఫ్యామిలీ నుంచి వచ్చే ఆస్తి మాత్రం వందల కోట్లలో ఉందట. ఆమె బ్రదర్స్, సిస్టర్స్‌కు ఇవ్వగా తనకొచ్చిన షేర్ వందల కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
దీంతో మెగా ఫ్యామిలీని విమర్శించే వారు.. వరుణ్.. లావణ్య కాలీ గోటికి కూడా సరిపోడు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత ఆస్తి పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవికి కూడా ఉండదని కామెంట్లు పెడుతున్నారు. అందుకే ఈ ముద్దుగుమ్మను వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? ఇండస్ట్రీలో అంతమంది కత్తిలాంటి హీరోయిన్స్ ఉండగా.. ఈమెను లవ్ చేయడానికి ఇదే కారణమేమో? పైగా నార్త్ ఇండియా అమ్మాయి.. మళ్లీ వరుణ్ కంటే చాలా పొట్టిగా ఉంటుంది. అని కామెంట్స్ చేస్తున్నారు.