karan johar: నీ కూతురి తల్లి ఎవరు అని నెటిజన్ కామెంట్.. కరణ్ జోహార్ స్ట్రాంగ్ కౌంటర్ (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-08-25 14:40:05.0  )
karan johar: నీ కూతురి తల్లి ఎవరు అని నెటిజన్ కామెంట్.. కరణ్ జోహార్ స్ట్రాంగ్ కౌంటర్ (పోస్ట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోకు హోస్ట్ చేసి పలు సెలబ్రీలతో సందడి చేశారు. అలాగే పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు పంచుకుంటారు. అయితే ఆయన పిల్లలపై ఉన్న ఇష్టంతో 2017లో సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు (యశ్, రూహీ) తండ్రి అయ్యారు. ఇక అప్పటి నుంచి పిల్లలను, ఆయన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ కెరీర్‌లోనూ ముందుకు సాగుతున్నాడు. అలాగే నెట్టింట కామెంట్లు పెట్టేవారికి స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తూ రచ్చ చేస్తున్నాడు.

ఈ క్రమంలో.. తాజాగా, ఆయన తన కూతురు రూహీ సిరితో ఆడుకుంటున్న వీడియో షేర్ చేశాడు. దానికి రూహీ వర్సెస్ సిరి అనే క్యాప్షన్ కూడా జత చేయడంతో.. ఓ నెటిజన్ నీ కూతురి తల్లి ఎవరు? దయచేసి చెప్పండి. గందరగోళానికి గురవుతున్నా’’ అని కామెంట్ పెట్టాడు. ఇక అది చూసిన కరణ్ జోహార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘ఆమెకు తండ్రి మాత్రమే కాదు తల్లిని కూడా నేనే. మీ అయోమయ స్థితి గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. అందుకే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది’’ అని రాసుకొచ్చాడు. ప్రజెంట్ కరణ్ పోస్ట్‌కు నెటిజన్లు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. స్ట్రాంగ్ కౌంటర్ వేశారని అంటున్నారు.




(Video Link Credits to karanjohar Instagram Channel)

Advertisement

Next Story

Most Viewed