Lord Ganesh: వినాయకుడి కోసం ఏకంగా స్వర్గం సెట్ వేసిన బాలీవుడ్ హీరోయిన్ .. ఆశ్చర్యపోతున్న నెటిజెన్స్

by Prasanna |
Lord Ganesh: వినాయకుడి కోసం ఏకంగా స్వర్గం సెట్  వేసిన బాలీవుడ్ హీరోయిన్ ..  ఆశ్చర్యపోతున్న  నెటిజెన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : పది రోజులు పూజలందుకున్న గణేషుడు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. నేడు దేశమంతటా వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు వారి ఇళ్లల్లో ప్రతిష్టించిన గణపతి దేవుడిని ఫోటోలు తీసి తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ ఫోటోలను చూసి అందరూ షాక్ అవుతున్నారు.

బాలీవుడ్ భామ సుర్వీన్ చావ్లా మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ గణేషుడు కోసం ఏకంగా స్వర్గం సెట్ వేసింది. కైలాసం ఎలా ఉంటుందో అచ్చం అలాగే వినాయకుడి చుట్టూ మేఘాలు, వెనక చంద్రుడిని పెట్టి చాలా బాగా క్రియోట్ చేసింది. తాజాగా వినాయక చవితి నిమజ్జనం రోజు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెట్టింట వైరల్ గా మారాయి. ఇంత బాగా డిజైన్ చేసినందుకు ఆమెపై నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫోటోల్లో బొజ్జ గణపయ్యను చూసి మురిసిపోతున్నారు భక్తులు.

Read More..

OTT Movie: ఓటీటీలో దూసుకెళ్తున్న అనసూయ, జగపతి బాబు సినిమా..


Advertisement

Next Story

Most Viewed