Hansika: గ్లామర్ డోస్ అమాంతం పెంచేసిన హన్సిక.. ఫైర్ బ్రాండ్ అంటూ పొగిడేస్తున్న నెటిజన్లు

by Kavitha |   ( Updated:2024-07-18 08:31:49.0  )
Hansika: గ్లామర్ డోస్ అమాంతం పెంచేసిన హన్సిక.. ఫైర్ బ్రాండ్ అంటూ పొగిడేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన హన్సిక అందరికీ సుపరిచితమే. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘దేశముదురు’ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్‌డమ్ అందుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘కంత్రి’, రామ్ పోతినేని సరసన ‘మస్కా’, పాన్ ఇండియా ప్రభాస్ సరసన ‘బిల్లా’ వంటి మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇలా తెలుగు సినిమాల్లో నటిస్తునే తమిళ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అలా అక్కడ కూడా వరుస సినిమాలతో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే వ్యాపార వేత్త సోహెల్ కతూరియాతో 2022 లో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ మళ్లీ ఈటీలో ప్రసారమయ్యే ఢీ సెలబ్రిటీ స్పెషల్- 2 అనే రియాలిటీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమె పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంది.

తాజాగ హన్సిక తన ఇన్‌స్టా అకౌంట్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ డ్రెస్‌ వేసుకొని స్టన్నింగ్ లుక్స్‌లో స్టిల్స్ ఇచ్చి్ంది. అది చూసిన నెటిజన్లు ‘ఫైర్ బ్రాండ్’ అని పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట సూపర్‌గా వైరల్ అవుతున్నాయి.

(photo link credits to hanshika instagram id)

Advertisement

Next Story

Most Viewed