AAY Movie: ఏపీ వరద బాధితులకు ‘ఆయ్‌’ మూవీ టీం సాయం.. మెచ్చుకుంటున్న నెటిజెన్స్

by Prasanna |   ( Updated:2024-09-05 12:54:08.0  )
AAY Movie: ఏపీ వరద బాధితులకు ‘ఆయ్‌’ మూవీ టీం సాయం.. మెచ్చుకుంటున్న నెటిజెన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఏపీ లో ఎక్కడ చూసిన వరదలే.. అకాల వర్షాల కారణంగా ఊర్లు అన్ని జలమయ్యాయి. ఒక జిల్లా అని లేదు.. ఒక ఊరు అని లేదు.. అన్ని ప్రాంతాల్లో భారీ వ‌ర్షాల వలన తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయ్ మూవీ టీం గొప్ప మనసు చాటుకుంది. వ‌ర‌ద బాధితుల‌కు ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు నిర్మాత బ‌న్నీవాసు తెలియ‌జేశారు.

ఆయ్ మూవీ అన్ని సెంటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించి సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు వ‌చ్చే క‌లెక్ష‌న్ల‌లో నిర్మాత 25 శాతాన్ని జ‌న‌సేన పార్టీ త‌రుపున విరాళంగా ఇస్తామని ప్ర‌క‌టించారు. కష్ట కాలంలో సాయం చేస్తున్నందుకు నెటిజ‌న్లు ఆయ్ మూవీ టీం ని మెచ్చుకుంటున్నారు.

నార్నే నితిన్‌, నయన్‌ సారిక జోడిగా న‌టించిన మూవీ ‘ఆయ్‌’. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి అంజి కె.మణిపుత్ర ద‌ర్శ‌క‌త్వం వహించారు. GA2 పతాకం పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి లు ఈ సినిమాని నిర్మించారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య ముఖ్య పాత్రల్లో న‌టించి ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లో విడుదలైంది.

Advertisement

Next Story