‘రాజా సాబ్’ గ్లింప్స్‌లో డైలాగ్ జోడించమన్న నెటిజన్.. డైరెక్టర్ అదిరిపోయే ఆన్సర్

by Anjali |   ( Updated:2024-08-02 07:49:08.0  )
‘రాజా సాబ్’ గ్లింప్స్‌లో డైలాగ్ జోడించమన్న నెటిజన్.. డైరెక్టర్ అదిరిపోయే ఆన్సర్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజా సాబ్’ చిత్రం నుంచి నిన్న(జులై 29) ‘ఫ్యాన్స్ ఇండియా గ్లింప్స్’ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ రెబల్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ప్రభాస్ బైక్ దిగి.. నడుచుకుంటూ వస్తూ పూల గుచ్ఛం చేతిలో పట్టుకుని వింటేజ్ లుక్‌లో అదిపోయారు. కారు అద్దంలో తనను తాను చూసుకుంటూ ఫ్లవర్స్ చల్లుతోన్న విజువల్స్ గురించి అయితే చెప్పుకోనవసరం లేదు. కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో పాన్ ఇండియా స్టార్ తెగ హ్యాండ్సమ్ కనిపించడంతో ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ అయితే చచ్చిపోతున్నారనడంలో అతిశక్తిలేదు.

లవ్ సింబల్స్‌లో హోరెత్తిస్తున్నారు. నిమిషం నిడివి ఉన్న ఈ గ్లింప్స్‌కు ఓ నెటిటన్ ‘ప్రభాస్ అన్న ఫైర్. ధన్యవాదాలు డైరెక్టర్ మారుతి సార్. ఛత్రపతి, మిర్చి సినిమాల్లో ఉన్నటువంటి బీజీఎం కావాలి సార్’ అని అడగ్గా.. వెంటనే మారుతి ఒకే అన్నారు. మరో ఫ్యాన్స్.. గ్లింప్స్ లో ఒకే ఒక్క డైలాగ్ జోడించొచ్చు కదా అన్న అని అడిగాడు. అవన్నీ టీజర్‌లోనే అంటూ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టారు. ఇందులో దిశా పటానీ, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూల్ వంటి అగ్ర నటులు నటించి.. తమ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు కూడా స్పందించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed