Netflix: ఇకపై తక్కువ ధరలకే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌

by Mahesh |   ( Updated:2022-07-14 09:39:13.0  )
Netflix Subscription Price is set to Reduce for all Plans at the end of this year
X

దిశ, సినిమా: Netflix Subscription Price is set to Reduce for all Plans at the end of this year| ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. కానీ ఇతర కాంపిటీటర్స్‌తో పోలిస్తే సబ్‌స్క్రిప్షన్ కోసం అధిక ధరలు వసూలు చేస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్‌ ఏడాది ప్లాన్‌ ధర రూ.1500 మాత్రమే కాగా నెట్‌ఫ్లిక్స్‌‌లో అదే ప్లాన్ ధర రూ.1700. ఇదే కారణంగా ఈ ఏడాది ప్రథమార్థంలోనే 2 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది.

దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన నెట్‌ఫ్లిక్స్‌.. యాడ్స్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్‌ దిశగా ఆలోచిస్తోంది. ప్రస్తుతం యాడ్స్‌ రహితంగా ఉన్న బేసిక్‌, స్టాండర్డ్‌, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్‌కు తోడుగా ఈ కొత్త ప్యాక్ తీసుకురానుంది. ఇక నెలకు రూ.199తో కేవలం మొబైల్‌ ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది చివరినాటికి యాడ్‌-సపోర్టెడ్‌ ప్లాన్స్‌ తీసుకురానుంది. కాగా గత ప్లాన్స్‌తో పోలిస్తే ఇవి చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ.. అర్హులు వీరే

Advertisement

Next Story