‘విరుపాక్ష’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?

by sudharani |   ( Updated:2023-04-21 13:39:51.0  )
‘విరుపాక్ష’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ కార్తీక్ వర్మ డాండు కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘విరుపాక్ష’. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ సినిమా.. ఈరోజు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఏదైనా కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాగానే.. ఏ ఓటీటీలోకి వస్తాయి..? ఎప్పుడు వస్తుంది..? అని ఎదురుచూస్తుంటారు సినీ ప్రేమికులు.

అయితే ‘విరుపాక్ష’ డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమా కార్డ్స్‌లో నెట్ ఫ్లిక్స్ నేమ్ ఉండటంతో ఇది కన్ఫర్మ్ అయింది. కాగా.. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది అంటే..? సినిమా హిట్ టాక్ అందుకుంది కాబట్టి ఓ నెల రోజులు దాటిన తర్వాత స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read...

Virupaksha Movie : 'విరూపాక్ష' ట్విట్టర్ రివ్యూ

Advertisement

Next Story