- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘టిల్లు స్క్వేర్’ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్..! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజా సినిమా ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ ఎంతో ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఓ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేయ్యడంతో.. మూవీపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రేపు (మార్చి 29) రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో మూవీ ప్రమోషన్స్ బిజీ అయిపోయారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘టిల్లు స్వ్కేర్’ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
అయితే ‘డీజే టిల్లు’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. థియేట్రికల్ టైం పూర్తి అయిన తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే చాన్స్ ఉంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండటంతో మే లాస్ట్ వీక్‌లో ఓటీటీలోకి వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సొంతం చేసుకుంటోంది అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే.