లవ్ ఎఫైర్‌‌పై స్పందించిన రాధిక.. మీరే చెప్పాలంటూ

by sudharani |   ( Updated:2023-09-27 08:06:58.0  )
లవ్ ఎఫైర్‌‌పై స్పందించిన రాధిక.. మీరే చెప్పాలంటూ
X

దిశ, సినిమా: ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహశెట్టి ఎట్టకేలకు తన లవ్ ఎఫైర్‌ గురించి స్పందించింది. కిరణ్ అబ్బవరం సరసన ఆమె నటించిన తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ప్రమోషన్స్‌ నిర్వహిస్తుండగా తాజా ఇంటర్వ్యూలో డేటింగ్ గురించి ఎదురైన ప్రశ్నలకు నేహశెట్టి ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ఈ మేరకు ‘ప్రస్తుతం మీరు ఎవరితోనైన ప్రేమలో ఉన్నారా? మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా?’ అని ఓ విలేఖరి ప్రశ్నించాడు. దీంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన నటి.. ‘మీరే చెప్పండి’ అని అడిగింది. వెంటనే ‘మాకు తెలిసి మీరు లవ్‌లో ఉన్నారనిపిస్తోంది’ అని సదరు వ్యక్తి చెప్పగానే తెగ నవ్వేసిన బ్యూటీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే దాటవేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story