- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిల్లు3లో రాధిక.. ఆ హీరోయిన్ రియాక్షన్ ఏమిటంటే?
దిశ, సినిమా : బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈమె సొంతం. మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సినిమాతో అంతగా గుర్తింపు రాలేదు. అయితే తర్వాత ఈ నటి డిజే టిల్లు సినిమాలో నటించి, తన అదం, నటనతో కుర్రకారు మదిని దోచేసింది. రాధికగా యూత్ గుండెలను కొల్లగొట్టింది. ఇప్పటికీ నేహా కంటే రాధికాగానే ఈ బ్యూటీ అందరికీ పరిచయం అంతలా ఈ పాత్ర ద్వారా నేహా గుర్తింపు సంపాదించుకుంది.
అయితే డీజే టిల్లు మూవీ విడుదలై ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిద్దు జొన్నలగడ్డ తన బాడీ లాంగ్వేజ్, కామెడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్ వచ్చింది. ఈ మూవీలో అనుపమ రొమాంటిక్‌గా కనిపించి మెప్పించింది. అయితే ఈ మూవీ కూడా విడుదలై రికార్డ్స్ బ్రేక్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొళ్లగొట్టింది. ఇక ఈ మూవీలో రాధిక కూడా గెస్ట్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఈ మూవీ అనంతరం డీజే టిల్లు3 కూడా రాబోతుందంటూ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే మరి డీజే టిల్లు 3లో నేహా శెట్టి, రాధిక ఉంటుందా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంది. దీంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నేహా శెట్టిని యాంకర్. రాధిక డీజే టిల్లు3లో మళ్లీ కనిపించే ఛాన్స్ ఉందా అని అడగ్గా, దానికి నటి సమాధానం చెబుతూ.. చెప్పలేం. రాధిక కథను ఇంకా ప్రేక్షకులకు చెప్పాలి అనుకుంటే చెప్తారు.
సినిమాలో ఒక క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు ముందు, వెనుక ఏం జరుగుతుందో తెలియకుండానే ఆ డైలాగ్ బయటికి వచ్చేస్తుంది. అలాగే టిల్లు స్క్వేర్‌లో రాధిక బెంగుళూరు వెళ్లిపోతున్నా అని చెప్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది నాకు కూడా తెలియదు. సినిమాలో బెంగుళూరు వెళ్తున్నాను అని రాధిక చెప్పింది. అక్కడే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందో, టిల్లు కోసం మళ్లీ తిరిగి వస్తుందో కూడా చెప్పలేం అంటూ చెప్పుకొచ్చింది.
- Tags
- Neha Shetty