ఆ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న నజ్రియా నజీమ్.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-05-13 13:49:10.0  )
ఆ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న నజ్రియా నజీమ్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్ నజ్రియా నజీమ్ ‘మాడ్ డాడ్’ మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ‘రాజా రాణి’ మూవీలో నటించి తన ఎక్స్‌ప్రేషన్స్‌తో కుర్రకారుల మతి పొగొట్టి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇటీవల నాని ‘అంటే సుందరానికి’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తోంది. తాజాగా, నజ్రియా నజీమ్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ‘‘నేను నా అన్ని సోషల్‌ మీడియా ఖాతాలనుంచి బ్రేక్‌ తీసుకుందామని అనుకుంటున్నాను. నేను మీ ప్రేమ, సందేశాలను చాలా మిస్‌ అవుతాను. నేను మళ్ళీ తిరిగి వస్తాను. నేను ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇప్పటి నుంచైనా ఆలోచించి సినిమాలు చేయాలనీ.. సమంతని కోరిన అభిమానులు




Advertisement

Next Story