- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అన్నపూరణి’ మూవీ విషయంలో నయనతార కన్నీటిపర్యంతం.. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ నయనతార తాజాగా నటించిన ‘అన్నపూరణి’ మూవీ వివాదాస్పమైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో కొన్ని సీన్లు హిందువుల మనోభావాలు, సాంప్రదాయాలు కించపరిచేలా ఉన్నాయని, శ్రీరాముడిని అగౌరవపరిచారని, లవ్ జిహాద్‌ను ప్రచారం చేశారంటూ మూవీ దర్శకుడు, నిర్మాత, నటీనటులపై మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో హిందూ సేవా పరిషత్ అనే సంస్థ కేసు వేసింది. ఈ క్రమంలో జబల్‌పూర్ నగరంలోని ఓమ్టి ప్రాంతానికి చెందిన పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. అందులో నటి నయనతార, సినిమా దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథీ, ఆర్.రవీంద్రన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ సహా ఏడుగురి పేర్లను నిందితులుగా చేర్చారు.
ఈ క్రమంలో డిసెంబరు 1న థియేటర్లలో విడుదలైన ‘అన్నపూరణి’ మూవీ, డిసెంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. మూవీపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఆ సినిమాను అర్ధంతరంగా తీసేశారు. దీంతో నటి నయనతార తన సినిమా ‘అన్నపూరణి’ వివాదంపై పలువురికి క్షమాపణలు చెప్పింది. తను, తన మూవీ టీమ్ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోవడం లేదని తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ‘జై శ్రీరామ్’ హెడ్డింగ్‌తో 'ఓం' అని రాసి ఉన్న మాస్టర్ హెడ్‌పై తన క్షమాపణలు తెలిపింది.
నయనతార తన పోస్ట్‌లో..‘మేము అనుకోకుండా కొందరి బాధపెట్టొచ్చు. గతంలో థియేటర్లలో ప్రదర్శించబడిన సెన్సార్ అయిన చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నుంచి తీసివేస్తారని మేము ఊహించలేదు. సమస్య తీవ్రతను మేము అర్థం చేసుకున్నాం. భగవంతుడిని పూర్తిగా విశ్వసించే వ్యక్తిగా, దేశంలోని దేవాలయాలను తరచుగా సందర్శిస్తున్న వ్యక్తిగా చెబుతున్నా.. ఎవరి మనోభావాలనైనా మేము కించపరిస్తే.. వారికి నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నా’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది.