- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nayanthara : బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో నయనతార లవ్ స్టోరీ, రొమాన్స్!
దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి సుపరిచితమే. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌లో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత తెలుగులో మెల్లగా అవకాశాలు తగ్గడంతో ఈ నటి బాలీవుడ్ వైపు అడుగులు వేసి, అక్కడ కూడా తన మార్క్ చూపెట్టుకుంది. ఇక గతేడాది జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించి, మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ రచ్చ చేస్తుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్న నయన్, తాజాగా తన కొత్త మూవీని ప్రకటించింది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ తో మూవీ చేసేందుకు రెడీ అయింది. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చాలా రోజుల నుంచి తన భర్త పిల్లలతో గడుపుతూ, ఎంజాయ్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ తాజాగా, కోలివుడ్ యంగ్ హీరో సరసన నటించడానికి రెడీ అయ్యింది. బిగ్ బాస్ కంటెస్టెంట్, యంగ్ హీరో కవిన్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమాలో నటించడానికి నయనతార ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని, షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
దీనికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా మూవీ మేకర్స్ విడుదల చేయగా, దీనిపై నయన్ అభిమానుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. వయసులో చాలా చిన్న, పైగా బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా చేయడం ఏంటీ, మళ్లీ ప్రేమ కథ సినిమాలో నటించడమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.