- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నయన్.. నేను ఇక్కడ ఉన్నానని చెప్పు అంటూ వీడియో పోస్ట్
దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లు తన సినిమా అప్‌డేట్స్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పంచుకున్న నయన్.. ఇప్పుడు అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. ‘జైలర్’ సినిమాలోని హుకుమ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పిల్లలను ఎత్తుకుని మాస్ లెవల్లో ఎంట్రీ ఇస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘నేను ఇక్కడ ఉన్నానని చెప్పు’ అంటూ తమిళ్‌లో క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక ఆమె అలా ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పుడే లక్ష ఫాలోవర్స్ వచ్చి చేరగా.. పిల్లలతో కలిసి మ్యాచింగ్ వైట్ డ్రెస్, కళ్లద్దాలతో దర్శనమివ్వడంపై ఫ్యాన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇక నయన్ ఇన్‌స్టాలో భర్త విఘ్నేష్, షారుఖ్ ఖాన్, అనిరుధ్‌లతో పాటు తమ ప్రొడక్షన్ సంస్థ ది రౌడీ పిక్చర్స్, ఒబామా భార్య మిషెల్లి ఒబామాతో మొత్తంగా ఐదుగురిని ఫాలో అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Read More: షారుఖ్ ఖాన్ ‘జవాన్’ ట్రైలర్ విడుదల.. గూస్ బంప్స్ గ్యారంటీ!