అట్లీపై నయనతార సీరియస్.. ఆ సినిమాల్లో నటించొద్దని సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-21 05:44:22.0  )
అట్లీపై నయనతార సీరియస్.. ఆ సినిమాల్లో నటించొద్దని సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార. తెలుగుతో పాటు తమిళ్‌లో దాదాపు అందరూ అగ్రహీరోలతో కలిసి నటించారు. తాజాగా ‘జవాన్’ మూవీలో షారూక్ ఖాన్ సరసన నటించి బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీ రూ.900 కోట్లు వసూలు చేసి ఇంకా వసూళ్లను కొనసాగిస్తూనే ఉంది. ఇక, మూవీ విషయంలోనే డైరెక్టర్ అట్లీపై నయనతార సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. తదుపరి బాలీవుడ్ లో ఏ చిత్రాలను ఒప్పుకోకూడదని నయనతార ఫిక్స్ అయిందట.

ఇందుకు కారణం జవాన్ మూవీలో తాను నటించిన సీన్స్‌ని చెప్పా పెట్టకుండా కట్ చేయడమే అని తెలుస్తోంది. ఇదే క్రమంలో జవాన్ సినిమాలో దీపికా పదుకోన్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడం సైతం నయనతారకు కోపం తెప్పించిందట. గతంలో షారూక్ ఖాన్ తో దీపికా పలు సినిమాల్లో నటించగా వీరి జంట మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్న తనకు సినిమాలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని నయనతార ఆగ్రహంగా ఉన్నట్లు సినిమా వర్గాల ద్వారా తెలిసింది. ఈ కారణంగానే బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉండాలని నయనతార ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story