దేనికైనా టైమ్ రావాలి.. బాలీవుడ్ ఎంట్రీపై నయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Prasanna |   ( Updated:2023-09-09 06:52:07.0  )
దేనికైనా టైమ్ రావాలి.. బాలీవుడ్ ఎంట్రీపై నయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ అరంగేట్రం చేసిన మొదటి మూవీ ‘జవాన్’తో బిగ్ హిట్ అందుకోవడంపై నయనతార హ్యాపీగా ఫీల్ అవుతోంది. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకురాగా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతుంది. ఈ క్రమంలో రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. షారుఖ్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని, నిజంగా ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. అలాగే ‘బీ టౌన్ అరంగేట్రానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించగా.. ‘దేనికైనా సరైన సమయం రావాలి. కాస్త ఆలస్యమైనా నా అభిమాన హీరో షారుఖ్‌‌తో బాలీవుడ్‌లో పరిచయం కావడం చాలా హ్యాపీగా ఉంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌కు కూడా సమాన ప్రాధాన్యతనిస్తా. ఎక్కడ అవకాశాలను వదులుకోను’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story