ఇద్దరు హీరోయిన్ల మధ్య వార్.. ఆ నటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నయనతార

by sudharani |   ( Updated:2022-12-23 13:46:20.0  )
ఇద్దరు హీరోయిన్ల మధ్య వార్.. ఆ నటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నయనతార
X

దిశ, సినిమా: నయనతార లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'కనెక్ట్'. అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కథ ప్రకారం తల్లీకూతుళ్లు హోమ్ క్వారంటైన్లో ఉన్న 14 రోజుల్లో ఏ రోజు ఏం జరుగుతుందనేది ముఖ్యమైన అంశం. మనం థియేటర్‌లో కూర్చుని ఈ మూవీ చూస్తున్నప్పటికీ.. దర్శకుడు ప్రేక్షకులకు ఆ ఇంట్లో తిరుగుతున్న అనుభూతిని కలిగించాడు. ఇక రీసెంట్‌గా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నయనతార.. గతంలో తనపై ఒక హీరోయిన్ చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నయనతార మాట్లాడుతూ..

'నేను సినిమాకు తగ్గటుగా డైరెక్టర్ ఏది చెబితే అది చేస్తాను. డ్రెస్సింగ్ మేకప్ వాళ్లు చెప్పిన విధంగానే అనుసరిస్తా. కానీ, గతంలో ఒక ఇంటర్వ్యూ చూశాను. అందులో ఒక హీరోయిన్ నా మేకప్ గురించి కామెంట్ చేసింది. ఆ హీరోయిన్ పేరు చెప్పలేను కానీ.. నా మూవీలో ఒక హాస్పిటల్ సీన్‌లో నేను మేకప్ వేసుకోవడాన్ని ఆమె తప్పుపట్టింది. కమర్షియల్ రియలిస్టిక్ సినిమాల్లో లుక్స్ పరంగా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నయన్ ఫ్యాన్స్ మాత్రం ఈ మాటలు నటి మాళవికకే వర్తిస్తాయంటున్నారు. గతంలో మాళవిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'సూపర్ స్టార్‌గా పేరు సొంతం చేసుకున్న ఒక నటి ఆసుపత్రి సన్నివేశంలో ఫుల్ మేకప్ వేసుకుంది' అంటూ కామెంట్స్ చేసింది.

READ MORE

స్పోర్ట్స్ బ్రాతో దర్శనమిచ్చిన అనుష్క.. పిక్స్ వైరల్

Advertisement

Next Story