ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నయనతార.. భర్తను ‘అన్ ఫాలో’ కొట్టి మళ్లీ ఫాలో.. షాక్‌లో ఫ్యాన్స్

by sudharani |   ( Updated:2024-03-02 10:25:02.0  )
ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నయనతార.. భర్తను ‘అన్ ఫాలో’ కొట్టి మళ్లీ ఫాలో.. షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతారా.. 2022 జూన్‌లో విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు పది ఏళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అంతే కాకుండా గతేడాది సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నయన్ వరుస సినిమాలు చేస్తూనే.. 9Skin అంటూ వ్యాపార రంగంలోని రానిస్తుంది. ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నయన్.. తాజాగా షేర్ చేసిన పోస్ట్ పలు అనుమానాలకు దారి తీస్తుంది. అసలు విషయంలోకి వెళితే..

నయన్.. తన ఇన్‌స్టా ఖాతాను తెరిచినప్పటి నుంచి భర్త విఘ్నేశ్ శివన్ (విక్కీ)ని ఫాలో అవుతుంది. అయితే.. తాజాగా ఏం జరిగిందో తెలియదు కానీ, ఆమె విఘ్నేష్‌ను అన్ ఫాలో కొట్టిందని తెలుస్తోంది. దీంతో పాటు.. ‘కంట్లో కన్నీళ్ళతో కూడా ఆమె ఎప్పటికీ చెప్పగలదు నేను ఇది పొందానని’ అంటూ ఎమోషనల్ స్టోరి షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ పిచ్చేక్కిపోతున్నారు. నయన్‌కు, విఘ్నేశ్‌కు మధ్య ఏం జరిగి ఉంటోంది..? వాళ్లు విడిపోతారా అంటూ కొత్త చర్చ స్టార్ట్ చేశారు. అయితే.. ఈరోజు మళ్లీ తన భర్త విఘ్నేశ్‌ను ఫాలో అవుతోంది నయన్. ‘దీంతో టెక్నికల్ ఇష్యూ ఏదన్న జరిగి ఉంటుందా..? లేదా అనుకుండా అన్ ఫాలో చేసి ఉంటుందా’ అని అనుకుంటూనే ఏది ఏమోనా ఎమోషనల్ పోస్ట్ పెట్టిందంటే ఏదో ఉండే ఉంటుంది’ అంటూ అసలు కారణం తెలియక జుట్టు పీక్కుంటున్నారు నెటిజన్లు.

ఇదిలా ఉంటే.. విఘ్నేశ్ మాత్రం గత వారం రోజుల క్రితం నయనతార అవార్డు గెలుచుకోవడంతో తన భార్య ఫొటో షేర్ చేస్తూ.. ‘దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 రెడ్ కార్పెట్‌లో తన సొగసుతో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నయనతార, ప్రతిష్టాత్మకమైన మోస్ట్ బహుముఖ నటి అవార్డును సొంతం చేసుకుంది’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక చూసిన అభిమానులు కూడా అలాంటిది ఏమీ జరిగి ఉండుండదులే.. టెక్నికల్ ఇష్యూస్ అయుంటాయి అంటూ లైట్ తీసుకుంటున్నారు.

Read More..

ఉపాసన కాళ్లు పట్టుకుని మరీ సేవలు చేస్తున్న గ్లోబల్ స్టార్ (వీడియో).. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!





Advertisement

Next Story