రొమాంటిక్‌గా తమ ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న నయన్, విఘ్నేష్

by Jakkula Samataha |
రొమాంటిక్‌గా తమ ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న నయన్, విఘ్నేష్
X

దిశ, సినిమా : రొమాంటిక్ కపుల్ నయన్, విగ్నేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి జంట చూడటానికి ఎంతో క్యూట్‌గా ఉంటుంది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కవల పిల్లలు. ఇక ఈ మధ్య ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ తన అభిమానులతో పంచుకుంటుంది ఈ బ్యూటీ.

తాజాగా నయన్,విగ్నేష్ శివన్ లేటేస్ట్ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా వారి ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ..రొమాంటిక్‌గా ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీరి పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక వీటిని చూసిన నెటిజన్స్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక నయనతార తన అందం, నటనతో ఎంతో మందిని ఆకట్టుకొని, లేడీ సూపర్ స్టార్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు ఈ చిన్నది.ఇక ఈ అమ్మడు సినీ ఇష్యూస్ కంటే పరసనల్ లైఫ్ సమస్యలతో ఎక్కువగా వార్తల్లోకి ఎక్కింది. ప్రేమ, విడిపోవడం, సరోగసి ఇలా చాలా విషయాల్లో ఈ అమ్మడు ఇబ్బందుల్లో చిక్కుకుంది. కానీ చివరకు వాటన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొని, ఇప్పుడిప్పుడే తన పిల్లలు, విఘ్నేష్‌తో సంతోషంగా గడుపుతోంది.

Advertisement

Next Story