- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nawazuddin Siddiqui: భార్య, పిల్లలను బయటకు గెంటేసిన నటుడు.. రోడ్డుపై రోదిస్తున్న కూతురు
దిశ, సినిమా : నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, భార్య అలియా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు కానీ పిల్లల కోసం మళ్లీ కలిసిపోయారు. అయితే తమను అలియా ఇబ్బంది పెడుతుందని నవాజ్ తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. 40 రోజుల తర్వాత నెర్సోవా పోలీసులు పిలిస్తే బయటకు వెళ్లిన అలియా తిరిగి వచ్చేసరికి.. తనను, పిల్లలను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని పోస్ట్ పెట్టింది. కన్న తండ్రే ఇలా చేయడాన్ని తట్టుకోలేని కూతురు రోడ్డుపైనే ఏడుస్తుందని ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. తన దగ్గర పైసా కూడా లేదని, ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితుల్లో బంధువుల అమ్మాయి తన రూమ్‌కు తీసుకెళ్లిందని తెలుపుతూ.. ఆ గదిలో కింద పడుకున్న పిల్లలను చూపిస్తూ మరో వీడియో పెట్టింది. నవాజుద్దీన్ అసలు రంగు ఇదేనని.. నిజానికి తన పీఆర్ టీమ్ వల్లనే ఇలా అయిపోయాడని, వెంటనే ఆ టీమ్‌ను మార్చకపోతే అతన్ని కూడా బయటకు నెట్టే రోజులు వచ్చేస్తాయని సలహా ఇచ్చింది.
ఇవి కూడా చదవండి : చేతిలో మామిడి పండ్లు.. త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్ చేస్తానంటున్న కియారా పోస్ట్ వైరల్..!