ట్రాక్టర్ నడుపుకుంటున్న అమితాబ్ బచ్చన్ మనవరాలు

by sudharani |   ( Updated:2023-05-20 12:19:13.0  )
ట్రాక్టర్ నడుపుకుంటున్న అమితాబ్ బచ్చన్ మనవరాలు
X

దిశ, సినిమా : బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా నవేలీ నందా ట్రాక్టర్ నడుపుతున్న వీడియో నెట్టింట వైరల్ అయింది. సినిమాలంటే ఇంట్రెస్ట్ లేని ఆమె ప్రస్తుతం నాన్ ప్రొఫిట్ ఉమెన్ సెంట్రిక్ హెల్త్ టెక్ కంపెనీ ‘ఆరా హెల్త్‌’ రన్ చేస్తుండగా.. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని గణేష్‌పుర గ్రామంలోని మహిళలను కలిసింది. అక్కడ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమెను మహిళలు సాదరంగా స్వాగతించిన వీడియోతో పాటు అదే గ్రామంలో ట్రాక్టర్ నడిపిన క్లిపింగ్ పోస్ట్ చేసింది. దీంతో నవ్యపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్స్.. డౌన్ టు అర్త్ అంటూ కొనియాడుతున్నారు. కాగా ఈ వీడియోపై నవ్య రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ సిద్ధాంత్ చతుర్వేది రియాక్ట్ కావడం విశేషం.

Read More: అభిమాని మృతి.. నివాళులు అర్పించిన హీరో సూర్య

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘కేరళ స్టోరీ’..

Advertisement

Next Story