కామన్ మ్యాన్‌కు అవార్డ్ అంకితమిచ్చిన 'జాతిర్నతం'

by sudharani |
కామన్ మ్యాన్‌కు అవార్డ్ అంకితమిచ్చిన జాతిర్నతం
X

దిశ, సినిమా : తాజాగా బెంగళూరులో అట్టహాసంగా జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో టాలీవుడ్ యంగ్ యాక్టర్ నవీన్ పొలిశెట్టి 'జాతి రత్నాలు' మూవీకి ఉత్తమ నటుడి అవార్డ్ గెలుచుకున్నాడు. ఈ మూవీ మెత్తంగా 8 విభాగాల్లో నామినేట్ కాగా.. తనకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావడం పట్ల నవీన్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. 'సినిమా హీరో కావాలనుకోవడం నాలాంటి వాళ్లకు అందని కల. కానీ ఇవాళ నా కల నిజమైంది.

సైమాలో బెస్ట్ యాక్టర్(క్రిటిక్స్) అవార్డ్ అందుకోవడం మర్చిపోలేని అనుభూతినిస్తోంది. నేను అభిమానించే హీరోలు అల్లు అర్జున్, రణ్‌వీర్ సింగ్ సమక్షంలో అవార్డ్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ వేడుకలో వారి ప్రేమ, మద్దతు నాకు లభించడం నమ్మశక్యంగా లేదు. ఈ రాత్రిని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇదే స్ఫూర్తితో మరిన్న వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తాను. ప్రతి సాధారణ యువకుడికి ఈ అవార్డ్ అంకితం ఇస్తున్నా. మీరూ కష్టపడి ప్రయత్నిస్తే నాలాగే అనుకున్నది సాధించగలరు' అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed