oscars 2023-Naatu Naatu: తెలుగు సినిమా గర్వపడే సమయం (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-03-13 12:57:56.0  )
oscars 2023-Naatu Naatu: తెలుగు సినిమా గర్వపడే సమయం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాట పాడారు. అంతర్జాతీయ వేదికపై బ్లాక్ ట్రెడిషనల్ వేర్‏లో తెలుగు సింగర్స్ పాట పాడి అదరగొట్టారు. అంతేగాక, ‘నాటు నాటు’ పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు పెర్ఫామెన్స్ ఇచ్చారు. హాలీవుడ్ డ్యాన్సర్లు లైవ్ ప్రదర్శన ఇవ్వడంతో థియేటర్ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది. ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, నటులు రామ్ చరణ్ తేజ్-ఉపాసన, ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రచయిత చంద్రబోస్, సింగర్స్ రాహుల్ సిప్లింగంజ్, కాలభైరవ‌లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా.. ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు

బిగ్ బ్రేకింగ్.. భారత్‌కు ఆస్కార్ అవార్డ్

Advertisement

Next Story