- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాక్లో ‘నాటు నాటు’ సింగర్ కాలభైరవ.. సారీ అంటూ మెసేజ్..!
దిశ, వెబ్ డెస్క్: ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక ఆ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్ అవార్డునే కొల్లగొట్టింది. ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఈ పాటను ఒరిజినల్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ వేదికపై ఆలపించగా.. అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కాగా తాజాగా నాటు నాటు సింగర్లలో ఒకరైన కాలభైరవకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో కాలభైరవ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
ఇంతకు ఏం జరిగిందంటే..? నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఆర్ఆర్ఆర్ టీమ్ ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలోనే నాటు నాటు సింగర్ కాలభైరవ ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘‘ఆస్కార్ లో పాల్గొనడం ఆనందంగా ఉంది. అలాగే ఆస్కార్ వేదిక మీద పర్ఫామ్ చేయడం చాలా గొప్పగా అనిపించింది. నాకు ఇంతటి అవకాశం రావడానికి బాబాయి రాజమౌళి, నాన్న(కీరవాణి), కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఎస్ఎస్ కార్తీకేయ అన్న, అమ్మ, పెద్దమ్మలే కారణం. వీళ్లందరి కృషి పట్టుదల వల్లే నాటు నాటు సాంగ్ ఆస్కార్ స్థాయికి వెళ్లింది. 100 శాతం ఈ క్రెడిట్ వీళ్లకే దక్కుతుంది’’ అంటూ ట్వీట్ చేశాడు.
అయితే కాలభైరవ ట్వీట్ లో ఎక్కడా కూడా ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన లేదు. దీంతో ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కాలభైరవపై ఫైర్ అయ్యారు. కాలభైరవను టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో షాక్ తిన్న కాలభైరవ.. వెంటనే మరో ట్వీట్ చేశాడు. ‘‘ఆర్ఆర్ఆర్ మూవీ, నాటు నాటు సాంగ్ సక్సెస్ కు తారక్, చరణ్ అన్నలే ముఖ్య కారణం. కాకపోతే ఆస్కార్ స్టేజ్ మీద నాటు నాటు సాంగ్ పాడే అవకాశం రావడంలో నాకు హెల్ప్ చేసిన వారి గురించి మాత్రమే ఆ ట్వీట్ ద్వారా చెప్పాను. కానీ తన ట్వీట్ ను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకు నన్ను క్షమించండి’’ అంటూ ట్వీట్ చేశాడు.