‘నాటు నాటు’ నా టాప్ సాంగ్స్ లిస్టులో లేదు కీరవాణి షాకింగ్ కామెంట్స్.. (వీడియో వైరల్)

by Hamsa |   ( Updated:2023-04-29 06:46:49.0  )
‘నాటు నాటు’ నా టాప్ సాంగ్స్ లిస్టులో లేదు కీరవాణి షాకింగ్ కామెంట్స్.. (వీడియో వైరల్)
X

దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా పలు విషయాల్లో స్పందిస్తూ ఆసక్తికర పోస్టులతో రచ్చ చేస్తుంటాడు. అంతేకాకుండా ఇటీవల ఆర్జీవి హోస్ట్‌గా మారి యుట్యూబ్‌ ఛానల్‌లో ‘ నిజం’ అనే కొత్త షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. అబద్ధం బట్టలూడదీసి నిజం చూపించడమే ఈ షో లక్ష్యం అంటూ ఆర్జీవి తనదైన శైలిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. తాజాగా, పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని ఇంటర్వ్యూ చేశారు.

అంతేకాకుండా ‘ఆస్కార్ వెనుక నాటు నిజం’ అనే పేరుతో లేటెస్ట్ ఎపిసోడ్‌ను ఆర్జీవి తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అందులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వరించడం గురించి కీరవాణిని వర్మ ప్రశ్నించాడు. ఆ పాటకు వేరే వాల్లు మ్యూజిక్ అందిస్తే దానికి ఆస్కార్ వచ్చి ఉంటే ఆ పాటకు అంత అర్హత ఉందని మీరు భావించేవారా? అని కీరవాణిని వర్మ ప్రశ్నించారు. దానికి కీరవాణి మాట్లాడుతూ..‘‘ ఈ పాటకు ఆస్కార్ వచ్చినందుకు నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే ‘జయహో’ సాంగ్‌కు ఆస్కార్ వచ్చినప్పుడు కూడా అలా ఫీల్ కాలేదు కాబట్టి. అది ఎంత మెరిట్ తీసుకుందో నాటు నాటుకు కూడా అంతే ఉంది అని చెప్పుకొచ్చారు. అయితే ఆర్జీవి మరోసారి నాటు నాటు మీ కెరీర్‌లో టాప్ 100 సాంగ్స్‌లో అయినా ఉంటుందని అనుకుంటున్నారా? అని సూటి ప్రశ్న అడిగాడు. దీనికి కీరవాణి లేదని సమాధానమిచ్చారు. అంతేకాకుండా నాటు నాటు తన టాప్ లిస్టులో లేకపోయినా తనకు నచ్చిన పాటే అనే విధంగా స్పందించారు. ప్రస్తుతం కీరవాణి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story