రవితేజ సరసన నేషనల్ క్రష్ రష్మిక.. పూజా హెగ్డేను కాదంటూ..

by Prasanna |   ( Updated:2023-09-21 07:22:18.0  )
రవితేజ సరసన నేషనల్ క్రష్ రష్మిక.. పూజా హెగ్డేను కాదంటూ..
X

దిశ, సినిమా: మాస్ రాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనిది బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అనే తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. డాన్ శీను, బలుపు, క్రాక్.. వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. దీంతో వీరి కాంబోలో నాలుగో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. 1991లో జరిగిన చుండూరు ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఏంటంటే.. రవితేజకు జోడీగా ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుందట. మొదట పూజా హెగ్డే‌ను హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, ఏం జరిగిందో తెలియదు కానీ, ప్రజెంట్ రష్మిక ఓకే అయింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story