వెంకటేష్ అలా మాట్లాడాల్సింది కాదు : నేచురల్ స్టార్ నాని

by sudharani |   ( Updated:2023-03-17 14:04:02.0  )
వెంకటేష్ అలా మాట్లాడాల్సింది కాదు : నేచురల్ స్టార్ నాని
X

దిశ, సినిమా: ‘కేజీఎఫ్’ను ఉద్దేశిస్తూ ప్రముఖ దర్శకుడు వెంకటేశ్ మహా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నేచురల్ స్టార్ నాని స్పందించాడు. తాజాగా ఓ సమావేశంలో వివాదంపై మాట్లాడుతూ.. అతను అలా మాట్లాడాల్సింది కాదంటూ ఈ సంఘటనను దురదృష్టకరంగా భావిస్తానన్నాడు. ‘మహిళా దినోత్సవం రోజున దర్శకులంతా కలిసి చేసిన చర్చను చూశాను. వెంకటేష్ మాట్లాడిన విధానం సరైనది కాదు. ఆ కార్యక్రమంలో జరుగుతున్న చర్చ ఉన్నట్టుండి థియేటర్ బయట ప్రేక్షకులు మాట్లాడే విధంగా మారింది. దీంతో వెంకటేష్ భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఇక ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని వెల్లడించినపుడు పక్కనున్న కొంతమంది నవ్వడం సహజం. అయితే దాన్ని తప్పుగా భావించి అందరినీ విమర్శించడం కరెక్ట్ కాదు. అందుకే నేను చిన్న వీడియో క్లిప్ చూసి వాళ్లపై ఒక ఒపీనియన్‌కు రాలేను. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమే’ అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

కంగనతో ఎలాంటి సమస్య లేదు.. ఆమె కోరికలే ‘చీప్’

Advertisement

Next Story