Hero Nani: బలగం సినిమా ఆలస్యంగా చూశానని బాధపడిన నాని..!

by Anjali |   ( Updated:2023-06-21 05:55:31.0  )
Hero Nani: బలగం సినిమా ఆలస్యంగా చూశానని బాధపడిన నాని..!
X

దిశ, వెబ్‌డెస్క్: పల్లెటూరు పచ్చదనాన్ని, మట్టి మనుషుల బోలాతనాన్ని, మానవ సంబంధాల పరిమళాన్ని రంగరించి తెరపైకి తీసుకొచ్చి.. ప్రేక్షకుల మనసులను కదిలించి కన్నీళ్లు పెట్టించిన సినిమా ‘బలగం’. వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిలీం, బెస్ట్ ఫిలీం సినిమాటోగ్రాఫీ కేటగిరీల్లో రెండు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా హీరో నాని ఈ మూవీపై స్పందించి.. ‘తెలంగాణ గ్రామాల్లో ఉన్న బంధాలు, పల్లెటూరి ప్రజలు.. మరణం తర్వాత ఉండే ఆచార వ్యవహారాల్ని వేణు ఎల్దండి కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఈ చిత్రం చూసి కంటతడి పెట్టని వారంటు లేరు. చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు వేణును అభినందించారు. ఈ చిత్రం ఫ్రీగా ప్రతి విలేజ్‌లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని ఎందుకు ఇంత ఆలస్యంగా చూశానో అర్థం కావడం లేదు. ఇందులో నటించిన ప్రియదర్శి, కావ్య, కొమురయ్య, అతని కుటుంభ సభ్యులు అంతా నటనలో జీవించారు. మీ అందరికీ నా ప్రేమ’’ అంటూ నాని ప్రశంసలు కురిపిస్తూ ట్విట్ చేశారు. దీంతో వేణు, ప్రియదర్శి, థాంక్యూ అన్నా అని రిప్లై ఇచ్చారు.

Advertisement

Next Story