రజినీకాంత్ మూవీలో నాని కీ రోల్?

by Prasanna |   ( Updated:2023-07-27 09:15:44.0  )
రజినీకాంత్ మూవీలో నాని కీ రోల్?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ మూవీతో బిజీగా ఉన్నాడు. తర్వాత సినిమా ‘జై భీమ్’ దర్శకుడు టిజే జ్ఞానవేల్ ముత్తుతో చేయబోతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో నాని ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా ‘దసరా’ మూవీతో హిట్ అందుకున్న నాని ప్రస్తుతం తన 30వ చిత్రం ‘హాయ్ నాన్న’ షూటింగ్‌లో ఉన్నాడు. నాని, తలైవాతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారనే వార్తపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Advertisement

Next Story