దుల్కర్‌ సల్మాన్ పాన్ ఇండియా హీరో అంటూ నాని కామెంట్స్.. ఫైర్ అవుతున్న టాలీవుడ్ హీరోస్ ఫ్యాన్స్

by Hamsa |   ( Updated:2023-08-14 05:40:59.0  )
దుల్కర్‌ సల్మాన్ పాన్ ఇండియా హీరో అంటూ నాని కామెంట్స్.. ఫైర్ అవుతున్న టాలీవుడ్ హీరోస్ ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా, చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఆగస్టు 24న విడుదల కానుంది. తాజాగా, ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్రయూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అందులో భాగంగా నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా హీరో ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ సల్మాన్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. అలాగే ఓ తెలుగు, తమిళ, మలయాళం డైరెక్టర్స్ కూడా అతని కోసం స్క్రిప్ట్ రాసుకుంటారు. ఓ పాన్ ఇండియా యాక్టర్’కు నిర్వచనం ఇదే’’ అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో టాలీవుడ్‌లో ఉండే పాన్ ఇండియా హీరోల ఫ్యాన్స్ నానిపై మండిపడుతున్నారు. సౌత్ ఇండియా ప్రస్తుతం హీరోల్లో అందరికంటే ముందుగా బాలీవుడ్‌లో జెండా పాతిన ప్రభాస్.. ఆ తర్వాత రామ్ చరణ్, జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళందరూ గల్లీ హీరోలు అనుకుంటున్నావా? అంటూ నానిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒకరికి పాన్ ఇండియా గుర్తింపు ఇవ్వడానికి నువ్వు ఎవరు సినిమాలు చూసేది మేము గుర్తింపు కూడా మేమే ఇస్తామంటూ నాని ఆడేసుకుంటున్నారు.

Read More : డిస్ట్రిబ్యూటర్స్ కొంప మీదకి వస్తారని ముందే జంప్ అయిపోతున్నాడు.. చిరంజీవిపై దారుణమైన ట్రోల్స్

Advertisement

Next Story